కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేటీఆర్ కుట్ర : మంత్రి కోమటిరెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ కుట్ర చేస్తున్నారని  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేటీఆర్ ప్లాన్ చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతుందని.. త్వరలో అందరి పేర్లు బయటికి వస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు పంపించామని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని అన్నారు. అవాస్తవాలు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ నేతలను మించినోళ్లు లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రం రూ.7లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. నెలకు రూ.6వేల కోట్ల వడ్డీ కడుతున్నామని పేర్కొన్నారు. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని విమర్శించారు. వికారాబాద్ లో కూడా మాజీ ఎమ్మెల్యేతో ప్లాన్ చేసి కలెక్టర్ పై దాడి చేయించారని తెలిపారు. సురేష్ బీఆర్ఎస్ కార్యకర్త అని కేటీఆర్ అన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version