ప్రతి ఒక్కరూ జుట్టు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం వారు తలపై వివిధ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే, రసాయనాలు కలిగిన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల జుట్టు రాలిపోతుంది. కాబట్టి, జుట్టుకు ఎప్పుడూ సహజసిద్ధమైన ఉత్పత్తులనే వాడాలి. అప్పుడే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వాస్తవానికి, సహజ ఉత్పత్తులు జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందులో అరటి తొక్క. జుట్టు ఆరోగ్యంగా మరియు మెరుస్తూ ఉండటానికి ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అరటిపండు తొక్కను జుట్టుకు రాసుకుంటే ఏం జరుగుతుందో ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం.
అరటిపండు తొక్కను జుట్టుకు పట్టించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని తలకు పట్టించడం వల్ల వెంట్రుకల మూలాలు బలపడి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మీకు తెలుసా..అరటిపండు తొక్కను జుట్టుకు పట్టించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇవి రసాయనాల వంటి ప్రతికూల ప్రభావాలను చూపవు. అరటిపండు తొక్కతో తయారు చేసిన ప్యాక్‌ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
అరటిపండు తొక్కను జుట్టుకు రుద్దడం వల్ల జుట్టుకు సహజమైన మెరుపు రావడమే కాకుండా నిగనిగలాడుతుంది. అలాగే జుట్టు మృదువుగా మారుతుంది. కాబట్టి, మీ జుట్టు అందంగా మరియు మెరుస్తూ ఉండాలంటే, జుట్టు కోసం అరటిపండును ఉపయోగించండి.
అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా మారడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. కాబట్టి, మీరు దీన్ని హెయిర్ మాస్క్‌గా ఉపయోగించుకోండి.
అరటిపండు తొక్క కేవలం జుట్టుకు మాత్రమే కాదు.. ముఖానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఫేస్ మీద ట్యాన్‌ను తొలగించేందుకు అరటిపండుతొక్క బాగా ఉపయోగపడుతుంది. కేవలం ఆ తొక్కను తీసుకోని.. ముఖంపై రుద్దండి.. అలా స్లోగా మసాజ్ చేస్తుంటే.. ముఖంపై ఉన్న డార్క్ అంతా తగ్గిపోతుంది. రోజుకు ఒకసారి చేసినా ఏం కాదు.. మొటిమలు, మచ్చలు అన్నీ తగ్గిపోతాయి.