అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 30వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్దాం.. లేదా ఎక్కడికైనా వెళ్దాం. కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని తెలంగాణ నిరుద్యోగులు చెప్పినట్టయితే తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ సవాల్ విసిరారు.
తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి.. పరీక్షలు పూర్తి చేసి రిజల్ట్స్ వెల్లడించిన తరువాత కాంగ్రెస్ వచ్చి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిందన్నారు. కేవలం అపాయింట్ మెంట్ మాత్రమే ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెబుకుంటుందని కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు కేటీఆర్.