కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని ముందంజ

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు పోస్టల్, సర్వీసు ఓట్ల లెక్కింపు పూర్తయింది. వీటిలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. మరోవైపు కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రం సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీపీఐ పార్టీకి కొత్తగూడెం ఒక్క స్థానాన్ని మాత్రమే కేటాయించింది. ఈ సీటులో పోటీ చేసిన కూనంనేని ఇప్పుడు ముందంజలో కొనసాగుతున్నారు.

బీఆర్​ఎస్​ ఓటమి లక్ష్యంగా పనిచేయాలని భావించిన సీపీఐ.. 3 సీట్లిస్తే కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు చేసుకోవాలని మొదట భావించింది. కొత్తగూడెం, మునుగోడులతో పాటు బెల్లంపల్లి, హుస్నాబాద్‌లో ఏదో ఒక స్థానాన్ని అడిగింది. అయితే ఈసారి రాష్ట్రంలో అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ నేతలు కేవలం కొత్తగూడెం సీటు మాత్రమే సీపీఎం పార్టీకి కేటాయించాయి. తొలుత మునుగోడు ఇచ్చేందుకు హస్తం నేతలుసుముఖత వ్యక్తం చేసి చివరకు ఆ సీటును బీజేపీ నుంచి తిరిగి సొంతగూటికి చేరిన రాజగోపాల్ రెడ్డికి ఇచ్చింది. మరోవైపు ఖమ్మం జిల్లాలో తమకు బలమైన అభ్యర్థులను నిలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news