ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం సభకు గౌరవం కాదు : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ కోసం ఎంతో ప్రాణాలను అర్పించారు. తెలంగాణ కోసం మనందరం పోరాడిన వాళ్లమేనని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగం చర్చ సందర్భంగా తాజాగా సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు అయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ప్రతిపక్షనేత సభకు రాకపోవడం సభకు గౌరవం కాదన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేత సభకు హాజరవుతాడని ఆశిస్తున్నట్టు తెలిపారు.

తాను 80 వేల పుస్తకాలను చదివానని పదే పదే చెబుతుంటారు. తమ అనుభవాన్ని మా ప్రభుత్వం చేేసే పనులకు.. నిర్ణయాలు తప్పు ఒప్పు అని చెబుతారని ఆశిస్తే.. కేసీఆర్ అసెంబ్లీ సభకు హాజరు కావడం లేదన్నారు. గతంలో ఎన్నో లోప భూఇష్ట లోపాలు జరిగాయి. ఈ ప్రభుత్వం తీసుకునే మంచి నిర్ణయాలను అభినందిస్తారని అనుకున్నాం. కానీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఖండిస్తున్నారు. అయినప్పటికీ మేము వాటిని స్వీకరిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మంది TG గుండెల మీద రాసుకున్నారు. TG అని ఉండాలనే ప్రభుత్వం వాహనాల మీద TS బదులు TGగా మార్చిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news