హరీశ్ రావు లాంటి నేతలే ఆ పని చేస్తున్నారు : మంత్రి పొన్నం ప్రభాకర్

-

హైడ్రా విషయంలో సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు నమ్మవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసి బాధితులను బలవంతంగా కాళీ చేస్తున్నామని మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. మోసి బాధితులు అందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో పదేళ్లపాటు నిర్వాసితులను లాఠీలతో అణచివేశారు అని గుర్తు చేశారు.

 

మూసి బాధితులు అంశంలో హరీష్ రావు లాంటి నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి మూసి నిర్వాసితుల జీవితాలతో ఆడుకోవద్దని ప్రతిపక్షాలను కోరారు. హైదరాబాదులో దీర్ఘకాలింగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్టు తెలిపారు పేదలను నిలబెట్టే సంస్కృతి కాంగ్రెస్ది పడగొట్టే సంస్కృతి బిఆర్ఎస్ ది అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయంలో టిఆర్ఎస్ ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసు అని చురకలాంటించారు. టిఆర్ఎస్ పాలనలో నిత్యం అరెస్టులు జరిగేవని గుర్తు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news