BREAKING: సంగారెడ్డిలో కారును లారీ..ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు యువకులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ (మం) మాసాన్ పల్లి శివారులో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న అర్ధరాత్రి కారును ఢీకొట్టింది ఓ లారీ.
అయితే…. ఆ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యారు. వారిని ఆస్పత్రి తరలించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు. మృతులు జోగిపేటకు చెందిన వాజిద్, ముక్రమ్, హాజీలుగా గుర్తించారు పోలీసులు.