హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్‌.. మహేశ్ బాబు రియాక్షన్‌ చూశారా..?

-

భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ- రేసింగ్ ఈవెంట్​ జరగనుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల మేర ట్రాక్​పై జరగనున్న ఈ ఈవెంట్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ రవాణాను ప్రోత్సాహించే ఉద్దేశంతో ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

ఫార్ములా ఈ-రేసింగ్‌పై సూపర్ స్టార్ మహేశ్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియాలో మొదటి సారిగా జరుగుతున్న ఫార్మూలా ఈ రేసింగ్‌‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం ఓ గొప్ప విషయం. ఓ సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసిన కేటీఆర్‌కు, అనిల్ చలమలశెట్టి శుభాకాంక్షలు. ఫిబ్రవరి 11 జరుగునున్న ఈ రేసు పోటీలను చూడటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.’ అంటూ మహేశ్ బాబు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఫార్ములా ఈ-రేస్‌పై టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ కూడా స్పందించారు. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ-రేస్‌కు హైదరాబాద్ వేదిక కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌కు ఈ ఘనత తీసుకొస్తున్న మంత్రి కేటీఆర్, గ్రీన్ కో అనిల్ చలమలశెట్టి, తెలంగాణ ప్రభుత్వానికి శేష్ కృతజ్ఞతలు తెలి సేపారు.

Read more RELATED
Recommended to you

Latest news