నాలాలో కూర్చొని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆందోళన

-

Malkajgiri MLA Marri Rajasekhar Reddy: మల్కాజ్ గిరి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినూత్న నిరసనకు తెరలేపారు. నాలాలో కూర్చొని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆందోళనకు దిగారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని మిర్జల్ గుడా ప్రాంతంలో భారీ వర్షాలకు బాక్స్ డ్రెయిన్స్ దెబ్బతిన్నాయి.

Malkajgiri MLA Marri Rajasekhar Reddy’s concern by sitting in Nala

జీహెచ్ఎంసీ అధికారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి వాటిని పరిశీలించడానికి వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు ఎవ్వరూ రాలేదని ప్రభుత్వం తక్షణమే బాక్స్ డ్రెయిన్స్ రిపైర్ చేసి, అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌ గా మారాయి. అయితే..మల్కాజ్ గిరి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే పోరాట పటిమ బాగుందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news