బైడెన్, ట్రంప్​ మధ్య 90 నిమిషాల డిబేట్.. ఎప్పుడంటే?

-

అమెరికాలో మరికొన్ని నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్​ల మధ్య పోరు నెలకొంది. ఈ క్రమంలో అగ్రరాజ్య చరిత్రలో అత్యంత కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది. సర్వత్రా ఆసక్తి కలిగించే అధ్యక్ష చర్చకు అమెరికాలో రంగం సిద్ధమైంది.

నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న డెమోక్రటిక్‌ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా తలపడనుండగా.. జూన్‌ 27న మొదటిసారి ఈ ఇద్దరు నేతల మధ్య చర్చ జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్‌లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని వీరిద్దరూ స్పష్టం చేయనున్నారు.

ట్రంప్‌పై దూకుడైన వైఖరి ప్రదర్శించాలని బైడెన్‌ కోరుకుంటున్నారు. స్థిరమైన నాయకుడు కావాలో లేదా దోషిగా తేలిన వారు కావాలో తేల్చుకోమని బైడెన్‌ ప్రజలను కోరనున్నారు. మరోవైపు బైడెన్‌ హయాంలో ధరలు, వలసలు రికార్డుస్థాయిలో పెరగటాన్ని ట్రంప్‌ అస్త్రాలుగా మలుచుకోనున్నారు. ఈ వృద్ధ నేతల మానసిక సామర్థ్యానికి ఇదొక పరీక్ష అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news