పార్టీ మార్పు పై మల్లారెడ్డి కీలక ప్రకటన..!

-

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఆయనతో కుమారుడు భద్రారెడ్డి కూడా ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్లో చేర్చుకునేందుకు రాష్ట్ర నేతలైన సీఎం రేవంత్ రెడ్డి సహా మైనంపల్లి వంటి నేతలంతా నిరాకరిస్తుండటంతో డీకే శివకుమార్ ద్వారా పైరవీలు చేస్తున్నాడంటూ వార్తలు విస్తృతమయ్యాయి. దీంతో తాజాగా డీకేతో భేటీపై మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

తాజాగా  ఆయన ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. వ్యాపారాల విషయంలో రెండ్రోజుల క్రితమే డీకే శివకుమార్ను కలిశానని అన్నారు. తాను బీఆర్ఎస్ను వీడబోను అని స్పష్టం చేశారు. వేరే పార్టీల నుంచి మా కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయరు.. రాజకీయాల్లో ఉన్నన్నాళ్లు బీఆర్ఎస్లోనే కొనసాగుతామని చెప్పారు. డీకే శివకుమార్ నాకు ఆప్తమిత్రుడు అని అన్నారు. ప్రస్తుతం నాకు 71 సంవత్సరాలు ఉన్నాయని.. ఈ వయస్సులో పార్టీలు మారి తాను సాధించబోయేది ఏమీ లేదని వెల్లడించారు. అంతేకాదు.. తనకు ఇవే చివరి ఎన్నికలు అని.. ఇంకో ఐదారేళ్లు మాత్రమే రాజకీయాల్లో ఉంటానని కుండబద్దలు కొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news