ఇబ్రహీంపట్నం ఘటనపై స్పందించిన మంత్రి హరీష్ రావు

-

ఇటీవల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. నేడు నిమ్స్ ఆసుపత్రిలో బాధితులని పరామర్శించారు మంత్రి హరీష్ రావు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు మంత్రి హరీష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలో జరిగిన ఘటన చాలా బాధాకరమని అన్నారు. వెంటనే మా అధికారులు స్పందించారని.. 30 మందిలో కొంతమందిని నిమ్స్, మరి కొంతమందిని అపోలో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ప్రస్తుతానికి అందరూ సేఫ్ గా ఉన్నారని తెలిపారు. నిమ్స్ లో 17 మంది, అపోలో ఆసుపత్రిలో 13 మంది ఉన్నట్లు తెలిపారు మంత్రి హరీష్. మరో రెండు మూడు రోజులలో అందరిని డిశ్చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన ఆరు సంవత్సరాలలో 12 లక్షల ఆపరేషన్లు జరిగాయని.. కానీ ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందని అతని లైసెన్స్ ని క్యాన్సల్ చేసినట్లు తెలిపారు.

దీనిపై ఒక కమిటీని వేశామని.. రిపోర్టు రాగానే అందరిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్యశాఖ అధికారులు ఇక్కడే ఉంటున్నారని.. బాధితులని గంట గంటకు మానిటర్ చేస్తున్నామన్నారు. బాధితులకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా తో పాటు డబుల్ బెడ్ రూమ్ అందజేస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news