BRS పై మంత్రి కోమటి రెడ్డి ఫైర్..!

-

నలుగురు కాంగ్రెస్ మంత్రులతో కూడిన బృందం శుక్రవారం కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే న్యాయవిచారణకు ఆదేశించాలని నిర్ణయించగా.. నేరుగా ప్రాజెక్టు వద్దకే వెళ్లి అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేశారు. రీ డిజైన్‌ మొదలుకొని సాగులోకి వచ్చిన ఆయకట్టు వరకు అన్ని అంశాలను ఈ బృందం లోతుగా పరిశీలించారు. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తోపాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేక్‌ తదితరులు శుక్రవారం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించి.. ఇంజినీర్లు, గుత్తేదారులతోనూ చర్చించారు.

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణహిత ఎందుకు వద్దనుకున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల సంపదను కాపాడాల్సింది పోయి ఎందుకిలా చేశారంటూ ఈఎన్సీ అధికారి మురళిధర రావుపై కోమటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిపుణుల కమీటీ వేసి ఇందుకు సంబంధించిన పూర్తి అవినీతిని బయటకు లాగుతామన్నారు. ఇక దీనిపై స్పందించిన ఈఎన్సీ అధికారి మురళీధర రావు.. పోలీసులు ప్రాధమిక విచార చేశారని తెలిపారు. వారం పది రోజుల్లో మళ్లీ పనులు మొదలుపెడతామన్నారు. మిగతా మూడు గెట్లను సరిచేయాల్సివుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news