టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం మారిపోతోంది. ఇప్పటికే ఒంటరిగానే బరిలోకి దిగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోగా.. బీజేపీతో పొత్తుల్లో ఉన్న జనసేన తాము వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పని చేస్తామని ప్రకటించింది. ఆ దిశగా ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఇక ఇండియా కూటమి, అంటే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా కలిసి పోటీ చేసే విషయంలో చర్చలు జరుపుతున్నాయి. అయితే జనసేన పార్టీ బీజేపీతో ఉందా లేదా అనేది మాత్రం ఎటూ తేలడం లేదు. బీజేపీతో మేము పొత్తులో ఉన్నామని పలు సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. ఇక పురంధేశ్వరి కూడా అదే విషయం మరోసారి స్పష్టం చేశారు.


మేము జనసేనతో పొత్తులో ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే చెబుతున్నారని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. కానీ, తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో నేను పలానాచోట పోటీ చేస్తానని పార్టీని అడగలేదన్నారు పురంధేశ్వరి. కానీ, పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానన్నారు. కాగా, గతంలో కూడా బీజేపీ, జనసేన రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయని పవన్ చెప్పడం జనసేనాని కూడా అదే చెబుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చెబుతున్న విషయం విధితమే.

Read more RELATED
Recommended to you

Latest news