ఇంటర్ కాలేజీల్లో విద్యార్ధుల మరణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో ఇంటర్ విద్యార్ధుల సూసైడ్ లకు సంబంధించిన వార్తలు ఎక్కువయ్యాయి. అందులో గత పది రోజుల్లో ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణం అని ఆయన అన్నారు. ర్యాంకుల పేరిట విద్యార్ధులను మానసిక ఒత్తిడికి గురిచేసే విధానాలను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మానుకోవాలి అని హెచ్చరించారు మంత్రి. ఇక విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్న కాలేజీల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు.
అలాగే విద్యార్ధులు అధైర్యపడి క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకొని తల్లితండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దని కోరిన మంత్రి.. ఇంటర్ విద్యార్ధులకు ఏదైన అత్యవసర సమస్య ఉంటే నా ఆఫీసు మొబైల్ నెంబర్ ను 8688007954 లేదా minister.randbc@gmail.com ఈమెయిల్ కు తెలియజేయండి అన్నారు. అలాగే చావు సమస్యకు అంతిమ పరిష్కారం కాదు – బ్రతికి సాధించాలని విద్యార్ధులకు మంత్రి పిలుపు ఇచ్చారు.