రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్. సమస్య ఉందని ఎవరైనా చెబితే వెంటనే స్పందిస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన రిక్వెస్ట్ అయికే క్షణాల్లో రియాక్ట్ అవుతారు. అలా ఇవాళ ఓ బుడ్డోడు కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. మంత్రి స్పందించడంతో దెబ్బకు అధికార యంత్రాంగం దిగొచ్చింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే..?
హైదరాబాద్‌లోని గోల్డెన్ సిటీ కాలనికి గత 5 ఏళ్లుగా తాగునీరు అందడం లేదు. దీనితో అక్కడి వాసులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై ఓ చిన్నోడు వీడియో తీసి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. ఆ వీడియోలో బాలల దినోత్సవం రోజు కేటీఆర్ అంకుల్‌కు విజ్ఞప్తి అంటూ… ఓ బోర్డ్ పట్టుకుని నిలబడ్డాడు ఉమర్. ”మా కాలనీకి 5 ఏళ్లుగా నీళ్లు అందడం లేదంటూ.. అందులో రాసి ఉంది. మేం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం.. ప్లీజ్ అంకుల్ సాయం చేయండి.. అంటూ.. ఆ బుడ్డోడు కేటీఆర్‌ను కోరాడు.
Request @HMWSSBOnline MD Dana Kishore Garu @MDHMWSSB to visit personally today and resolve the issue@KTRoffice please follow up https://t.co/XEaBGQ2h5K
— KTR (@KTRTRS) November 14, 2022
ట్వీట్‌ను చూసిన కేటీఆర్ వెంటనే స్పందించారు. అక్కడి కాలనీకి వెళ్లి సమస్య పరిష్కరించాలని జలమండలి ఎండీ దానకిషోర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో గోల్డెన్ సిటీ కాలనీకి జలమండలి ఎండీ దానకిశోర్ వెళ్లారు. చిన్నారి ఉమర్‌ను కలిశారు. ఆ కాలనీకి ఇప్పటికే తాగునీటి సరఫరా లైన్ కోసం 2.85 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రెండు వారాల్లో కాలనీకి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు ట్యాంకర్లతో కాలనీకి నీరు అందిస్తామన్న జలమండలి ఎండీ దాన కిశోర్ హామీ ఇచ్చారు.
Well done MD Garu 👍 https://t.co/ukjs32Tzuo
— KTR (@KTRTRS) November 14, 2022