ఇండిగో సిబ్బంది తీరుపై మంత్రి కేటీఆర్ ట్వీట్

-

ఇండిగో విమానంలో తెలుగు మహిళలకు అవమానం జరిగింది. భాష పేరుతో వివక్షకు గురైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అహ్మదాబాద్ కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవాస్మిత ఫోటోని షేర్ చేస్తూ సంబంధిత వివరాలను పంచుకున్నారు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. “సెప్టెంబర్ 16న ఇండిగో విమానంలో తెలుగు మహిళ విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నారు.

ఇంగ్లీష్, హిందీ రాదని కారణంతో ఆమె సీటు మార్చి.. ఇండిగో విమాన సిబ్బంది వివక్షని చూపించారు. ఆమెతో మాట్లాడిన ఫ్లైట్ అటెండెంట్ భద్రతాపరమైన ఆందోళనగా పేర్కొంటూ ఆ మహిళ పట్ల వివక్ష ప్రదర్శించారు” అంటూ దేవస్మిత ట్విట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ఇండిగో యాజమాన్యానికి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఇకనుంచైనా స్థానిక భాషలు మాత్రమే మాట్లాడగలిగిన ప్రయాణికులను కూడా గౌరవించాలని సూచించారు. విమానాలు ప్రయాణించే రూట్ల ఆధారంగా ఆయా భాషలు మాట్లాడగలిగే సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. అలా అయితే ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news