V6 ఛానెల్ ను తెలంగాణలో బ్యాన్ చేస్తామని హెచ్చరించారు KTR. కవితకు నోటీసులు ఇచ్చిన విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అయితే, కేటీఆర్ మాట్లాడుతూంటే, వీ6 ఛానెల్ విలేఖరి.. అన్ని వింత ప్రశ్నలు అడగటంతో… కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే.. సరైన సమయంలో V6 ఛానెల్ ను తెలంగాణలో బ్యాన్ చేస్తామని హెచ్చరించారు KTR.
ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరగానే కేసులు ఏమైపోతున్నాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సుజనా చౌదరిపై రూ.6వేల కోట్ల కేసు ఏమైందని అడిగారు. అదానీపై కేసులు ఏమయ్యాయని.. ఆయనపై శ్రీలంక చేసిన ఆరోపణలుకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ కేసులు కేవలం ప్రతిపక్షాలపైనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. బీజేపీలో ఉన్న వాళ్లంతా సత్యహరిశ్చంద్రుని సోదరసోదరీమణులా అని కేటీఆర్ అన్నారు.