పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి : మంత్రి కేటీఆర్

-

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 24 గంటలు తాగునీటి సదుపాయం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సోమాజిగూడ లోని హోటల్లో పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్నో అనుమానాలు ఉండేవి. వీరికి పరిపాలన సాధ్యమవుతుందా అనుకున్నా పదేళ్ల కిందట పది రోజులు కరెంటు లేకపోయినా అడిగే వారు లేరు. ఇప్పుడేమో 10 నిమిషాలు కరెంటు పోతే ఇదేనా బంగారు తెలంగాణ అంటున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన ఒకాయన సరిగ్గా స్క్రిప్ట్ ఇవ్వకపోవడంతో మా రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని చెప్తున్నారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేటీఆర్ వివరించారు.

కొత్త పరిశ్రమలకు ఇచ్చినట్టే పాత కంపెనీల కూడా రాయితీలు ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ను పలువురు పారిశ్రామికవేత్తలు కోరారు. మళ్లీ బీఆర్ఎస్ రావాలని తర్వాత మన డిమాండ్స్ నెరవేర్చుకోవాలన్నారు. గతంలో ఇండస్ట్రీ నడపాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం తర్వాత పరిస్థితులు మారాయి మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం రావడం కోసం అందరూ కష్టపడాలన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగం చాలా అభివృద్ధి చెందిందని.. అభివృద్ధి గెలవాలన్నారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news