బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం : కేసీఆర్

-

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసిఫాబాద్ ని జిల్లా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. వేల ఎకరాల పోడు భూముల పట్టాలను పంచారు. ఆసిఫాబాద్ జిల్లాలో 40వేల ఎకరాలకు పట్టాలిచ్చాం. పట్టాలతో పాటు రైతు బంధు కూడా కల్పించామని తెలిపారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ అని ఈ జిల్లాకు నేనే పేరు పెట్టానని తెలిపారు. ఆసిఫాబాద్ లో మెడికల్ కాలేజ్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదని తెలిపారు.

తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని.. రైతుబంధు, రైతుబీమా వంటి సౌకర్యాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ధరణీ పోర్టల్ ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. ప్రజలు ప్రతిపక్షాల మాయలో పడొద్దని సూచించారు సీఎం కేసీఆర్. రైతులకు, పేదలకు ఏ ప్రభుత్వ హయాంలో మంచి జరిగిందో ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news