రుణమాఫీ పై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన

-

తెలంగాణలో రుణమాఫీ పై మంత్రి కేటీఆర్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికలలోపు మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకు రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. రైతు బంధు కింద రూ.73వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో వేశామని.. 13లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మీ ఇచ్చామని పేర్కొన్నారు. మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు కేటీఆర్.

మరోవైపు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను గన్ పార్క్ వద్దకు రమ్మని సవాల్ చేస్తున్నారని.. నవ్వాలా సావాలా అర్థం కావడం లేదన్నారు. అమరవీరులుగా మార్చిన వీరే అమరవీరుల స్థూపం వద్దకు రమ్మంటారని.. బీఆర్ఎస్ ఎవ్వరికీ బీ టీమ్ కాదు. తెలంగాణకు ఏ టీమ్.. అవ్వల్ దర్జా టీమ్ అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ ఆనాడు రాహుల్ ను ముద్ద పప్పు అన్నాడు.. ఈనాడు నిప్పు అంటున్నాడు. రేవంత్ మారినప్పుడల్లా మనం మారాలా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news