BREAKING : నారాయణఖేడ్ లో మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు

-

బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మరో కార్యక్రమం రద్దు అయింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు అయింది. మంత్రి కేటీఆర్ బదులుగా రోడ్ షోలో పాల్గొననున్నారు మంత్రి హరీష్ రావు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారిక ప్రకటన చేసింది.

Minister KTR’s visit to Narayankhed was cancelled

ఇది ఇలా ఉండగా… మరో ఐదు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో డీప్ ఫేక్​పై కేటీఆర్.. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో డీప్‌ఫేక్‌లు చాలా రావొచ్చని పార్టీ కార్యకర్తలను అప్రమత్త చేశారు.

ఓటమి అంచున ఉన్న కాంగ్రెస్‌ ఓటర్ల ను మభ్యపెట్టేందుకు డీప్‌ఫేక్‌ తో దుష్ప్రచారం చేస్తుందని.. బీఆర్ఎస్ సైనికులు అప్రమత్తతో ఉండి ఓటర్లను చైతన్యపరచాలని కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఓటర్లు అప్రమత్తంగా ఉండి…సీఎం కేసీఆర్‌ ను గెలిపించుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news