జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ పై మంత్రి పొన్నం కీలక ప్రకటన

-

జన్వాడ ఫామ్ హౌస్ పార్టీపై పొలిటికల్‌ ఫైట్‌ పీక్‌ స్టేజ్‌కు చేరింది. ప్రధాన పార్టీల మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. ఫామ్ హౌస్‌లో రేవ్‌ పార్టీ జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తుంటే.. సీసీ ఫుటేజ్‌ రిలీజ్‌ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. అటు.. ఫ్యామిలీ పార్టీని రేవ్‌ పార్టీగా ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌, బీజేపీపై బీఆర్ఎస్‌ భగ్గుమంటోంది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పార్టీ పై కీలక ప్రకటన చేశారు.

వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడైనా వందల మంది వచ్చి మద్యం సేవించాల్సిన పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఒకరిద్దరి విషయంలో ఎలాంటి నిబంధనలు ఉండవని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి మద్యపాన నిషేదం లేదని.. దావత్ లు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ లో ఎలాంటి నిబంధనలు తీసుకోకపోవడంతో కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మొత్తానికి జన్వాడ ఫామ్‌ హౌస్‌ పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news