మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ కీలక కామెంట్స్ చేసారు. తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లిన డబ్బు సంచులు మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేయలేదు అని ఆయన పేర్కొన్నారు. మహా యుతి కూటమి అభివృద్ధి మంత్రాలకే మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా మహారాష్ట్రలో కాంగ్రెస్ ను ప్రజలు చీదరించుకున్నారు అని అన్నారు.
ఇక అపద్దపు ప్రచారం చేసిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహించి ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసారు. దేశంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఒక్క బీజేపీ కూటమి మాత్రమే. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కానీ ఇక్కడ ఏపీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, పింఛన్లు అందజేస్తున్నాం. మాపై విశ్వాసంతో మహారాష్ట్రలో ముచ్చటగా మూడోసారి ప్రజలు అధికారం ఇచ్చారు అని సత్య కుమార్ పేర్కొన్నారు.