అందుకే BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు : మంత్రి సీతక్క

-

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి BRS నాయకులు కళ్ళలో నిప్పులు పోసుకుని బ్రతుకుతున్నారు. రాష్ట్రంలో జీవితాంతం కెసిఆర్ కుటుంబమే పరిపాలిస్తుందని BRS నాయకులు భ్రమల్లో బతికారు అని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామికంగా ఆలోచించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. ప్రజల సమస్యలను ప్రజాపాలన ద్వారా పరిష్కరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండవ రోజు నుండే కూల్చేస్తాం,కూలగొడతామంటూ అంటూ BRS వాళ్ళు మాట్లాడుతున్నారు. BRS వల్ల మాటలు నచ్చక వారి ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను BRS లో కలుపుకొని ఇతర పార్టీలను లేకుండా చేయాలనుకున్నారు. 10 ఏళ్లు ఇష్టరాజ్యంగా అధికారం అనుభవిస్తూ రాష్ట్రాన్ని తమ ఎస్టేట్ గా చేసుకోవాలనుకున్నారు. ప్రశ్నించే నాయకుల ఫోన్లు టాపింగ్ చేపించి,పోలీస్ వ్యవస్థను వాళ్ళ ఇంటి మనుషుల్లాగా వాడుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి పోలీస్ వ్యవస్థ, అధికార యంత్రాంగం ప్రజాస్వామికంగా పనిచేస్తుంది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలపై BRS నాయకులు చిందులు వేస్తున్నారు. BRS నాయకుల తీరు చూస్తుంటే గురివింద గింజ సామెత గుర్తొస్తుంది BRS అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేకు కండువా కప్పి వెంటనే మంత్రి పదవులు ఇచ్చారు. నేడు BRS వాళ్లు పార్టీ మారితే లేనిపోని ఆరోపణలు చేస్తూన్నారు అని సీతక్క పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news