పత్తి రైతుల కోసం కొబ్బరి కాయలు కొడుతున్నారు.. కానీ పత్తి మాత్రం కొనడం లేదు : హరీశ్ రావు

-

పత్తి రైతుల కోసం మంత్రులు కొబ్బరికాయలు కొడుతున్నారు కానీ.. పత్తి మాత్రం కొనడం లేదు అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.  రూ. 7521 కింట పత్తి కొంట మని మద్దతు ధర ప్రకటించారు.  కానీ ఈ రాష్ట్రంలో ఏ పత్తి రైతును అడిగిన రూ.5,500 పత్తి అమ్ముకుంటున్న పరిస్థితి ఏ రైతుకు కూడా పత్తికి మద్దతు ధర రాకపోయినా ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడటం లేదు అన్నారు.

Harish Rao
Harish Rao

రూ.500 బోనస్ అన్నావు.. కనీసం రూ.7500 మద్దతు ధర కూడా రైతులకు రావడం లేదు.  రాష్ట్రం అంతా రైతులు రోడ్డు ఎక్కుతుంటే.. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందన్నారు.  వడ్ల కొనుగోలుకు కొబ్బరికాయలు కొట్టుడే తప్ప.. రాష్ట్రంలో వడ్లు కొనే దిక్కు లేదు. రూ.2320 మద్దతు ధర రావాల్సిన వడ్లు రూ.1800, 1900 కు వరి పండించిన రైతులకు అన్యాయం చేస్తున్నావని హరీశ్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news