తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. ముఖ్యంగా 1985 నుంచి 2018 వరకు ఒక్కసారి కూడా ఓటమి చెందని వ్యక్తికి పీకే అవసరం ఎందుకు వచ్చిందని పేర్కొన్నారు. ప్రజల నాడి తెలియదా.. కుట్రలు కుతంత్రాలు నడవడం లేదని పీకే ను తెచ్చుకున్నారు. పీకే కన్నా మేధావులు తెలంగాణ ప్రజలు.
హుజూరాబాద్, దుబ్బాకలలో బీజేపీ గెలిచింది. మోటార్లకు మీటర్లు రాలేదు. రేపు బీజేపీ గెలుస్తుందని, మీటర్లు ఏమి రావని.. నాయి బ్రాహ్మణులకు, రజకులకు ఇచ్చే సబ్సిడీ ఎందుకు ఆగిపోతుంది. ఇంత చిల్లరనా.. ఇన్ని అబద్దాలా ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేసారు. కేసీఆర్ ఒక గురవింద గింజ అని, పీకే గీకేలు తెలంగాణలో పని చేయవు అని.. మోడీతో కేసీఆర్ పోలికనా..? ప్రజల ప్రేమను ప్రజల్లో స్వేఛ్చగా తిరిగే సత్తాను కేసీఆర్ కోల్పోయారు.