కౌశిక్ రెడ్డి ఆంబోతులాగా ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడకు : బల్మూర్ వెంకట్

-

ఈ మధ్య కాలంలో కేటీఆర్, కౌశిక్ డ్రగ్స్ తీసుకున్నారేమో అందుకే టెస్ట్ శాంపిల్స్ ఇవ్వండికి రావడం లేదు. రాజకీయాల్లో బాధ్యతల గల పదవీలో ఉన్నపుడు మనమీద వచ్చిన ఆరోపణలు నిరూపించుకోవాల్సిన ఉంటుంది అని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. గతంలో కేటీఆర్ అధికారంలో ఉన్నపుడు కూడా డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపణలు వచ్చాయి కానీ టెస్ట్ లు ఇవ్వలేదు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నపుడు విమర్శలు చేస్తున్నారు. రండీ డ్రగ్స్ ఎవరు తీసుకున్నారో తెలిసిపోతుంది టెస్ట్ లకు శాంపిల్స్ ఇద్దామన కూడా రాలేదు.

బహుశా కేటీఆర్ ఈ మధ్య ఏమైనా డ్రగ్స్ తీసుకున్నట్లు ఉన్నారు అందుకే శాంపిల్స్ ఇవ్వడానికి రాలేదు. కేటీఆర్ కి బాధ్యత లేదు అందుకే రాలేదు. ఆరోపణలు చేయడం కాదు.. వచ్చి టెస్ట్ లకోసం శాంపిల్స్ ఇవ్వాలి. అంత ధైర్యం లేనివాళ్లు అడ్డగోలుగా మాట్లాడొదు. మా సీఎం గారు no drugs అనే నినాదంతో నివారణ చేయడానికి ముందుకు వెళ్తుంటే.. బీఆర్ఎస్ నాయకులు ఆ వాతావరణం లేకుండా చూడాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు వారి మిత్రులతో కలిసి కలిసి డ్రగ్స్ సిటీ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఇకనైనా ఆంబోతులాగా ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడకు.. నోరు అదుపులోపెట్టుకొని మాట్లాడు అని హెచ్చరించారు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version