ఆడబిడ్డ అని కూడా చూడకుండా షర్మిల పై దాడి చేస్తారా? – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఆడబిడ్డ అని కూడా చూడకుండా షర్మిలపై దాడి చేయడం ఎంటి ?అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. యాత్రను అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. అనుమతి పొందిన యాత్రకు పోలీసులు భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత అన్నారు. ఆడబిడ్డ పార్టీకి అధ్యక్షులుగా ఉండకూడదా? అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి.

వై ఎస్ విగ్రహం ద్వంసం చేయడం రైతులు ..మహిళలు ..విద్యార్థులు మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. వైస్ విగ్రహం ద్వంసం చేయడం సిగ్గుచేటుని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ దాడులు చేస్తుంటే పోలీసులు నిచేస్టులై చూశారని ఆరోపించారు. విమర్శలు చేస్తే చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి కానీ.. దాడులు చేయడం ఏం సంస్కృతి అంటూ మండిపడ్డారు. వైఎస్ విగ్రహం పున ప్రతిష్టింపజేసే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు జీవన్ రెడ్డి.