తెలంగాణలో 5 వేలు దాటిన డెంగ్యూ కేసులు..!

-

తెలంగాణ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తాజాగా డేటా విడుదల చేసింది. అయితే హై రిస్క్ డెంగ్యూ కేసులు ఈ 2024 జనవరి 1వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు మొత్తం 5372 కేసులు నమోదు అయినట్లు అందులో పేర్కొంది. అయితే అత్యధికంగా ఈహై రిస్క్ డెంగ్యూ కేసులు హైద్రాబాద్ లో 1,852 నమోదమయ్యాయి. ఇక ఆ తర్వాత జిల్లాల వారీగా చూస్తే.. సూర్యాపేట 471, మేడ్చల్ మల్కాజిగిరి 426, ఖమ్మం 375, నల్గొండ 315, నిజామాబాద్ 286, రంగారెడ్డి 232, జగిత్యాల 185, సంగారెడ్డి 160, వరంగల్ లో 110 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి.

ఇక రాష్ట్రవ్యాప్తంగా చికెన్ గునియా కేసులు 152 నమోదు కాగా.. 191 మలేరియా కేసులు నమోదయ్యాయి. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేలో ఒక కోటి 42 లక్షల 78 వేల 723 ఇల్లు సందర్శించారు. అందులో 2లక్షల 65 వేల 324 జ్వరాలు ఉన్నట్టు గుర్తించారు హెల్త్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news