హైడ్రా వెనుక ఏదో దాగి ఉంది..!

-

హైదరాబాద్ లో హైడ్రా ఒక డ్రామా అంటూ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. గతంలో కేసీఆర్ కూడా ఇలానే అయ్యప్ప సోసైటీ ని కూల్చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక ఇలాంటివి తెరమీదకు తీస్తున్నారు. హైడ్రా వెనుక ఏదో దాగి ఉంది అని చెప్పిన ఆమె.. ఎన్నికల కోసమే హైడ్రా ఏర్పాటైందా అనే అనుమానం వ్యక్తం చేసారు. ప్రభుత్వాలు మారితే ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు గుర్తొస్తాయా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ పనితిరుని హైప్ చేయడానికే ఈ హైడ్రా. అయితే హైడ్రా పేరుతో హైడ్రామా వద్దు. ప్రజలు ఇచ్చిన అవకాశాలను ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవాలి. 111 జీవో కొనసాగించాలి. మక్తల్లో జరిగినంత ఇసుక దందా, మట్టి దందా ఎక్కడ జరగదేమో. పొలాలు, చెరువుల్లోని ఒండ్రుమట్టిని తరలిస్తుంటే ప్రభుత్వం ఎలా అనుమతులు ఇస్తోంది. జిల్లా అధికారులకు కనపడటం లేదా,ఈ వ్యవహారం వెనుక ఉన్నది ఎవరు. చెరువు తోడేస్తుంటే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నట్లు. చట్టాన్ని తుంగలో తొక్కి ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తున్న మీరు స్పందించరా. హైదరాబాద్ లో హైడ్రా సరే కానీ మక్తల్ చెరువుల సంగతి ఏంటి అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news