నేడు మరోసారి సిబిఐ విచారణ కు ఎంపీ అవినాష్ రెడ్డి….హాజరు కానున్నారు. రెండు రోజుల పాటు సుదీర్ఘంగా అవినాష్ రెడ్డి ని విచారించిన సిబిఐ…వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాల పై ఆరా తీసింది. అవినాష్ రెడ్డి కి వివేకానంద రెడ్డి కుటుంబానికి మధ్య విబేధాల పై సిబిఐ ఆరా తీసింది.
నిందితుల తో జరిపిన ఆర్ధిక లావాదేవీల పై ప్రశ్నించిన సిబిఐ.. 40 కోట్ల డీల్ పై అవినాష్ రెడ్డి పాత్ర పై ఆరా తీసింది. సహజ మరణంగా ఎందుకు చిత్రికరించారని ప్రశ్నించిన సిబిఐ… వివేకా చనిపోయిన రోజు అవినాష్ రెడ్డి కాల్స్ పై ఆరా తీస్తోంది. వైఎస్ భారతికి ఫోన్ చెయ్యడం పై పలు ప్రశ్నలు సంధించింది. ఎవిడెన్స్ టాంపరింగ్ పై కూపి లాగిన సిబిఐ..అవినాష్ రెడ్డి విచారణ మొత్తం వీడియో గ్రఫీ చేస్తోంది. ఈ తరుణంలోనే.. నేడు మరో సారి సిబిఐ విచారణ కు హాజరు కానున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. కాగా ఇప్పటికే వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.