సొంత పార్టీ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు ఎందుకు గెలిచింది .? లోకసభ ఎన్నికల్లో బిజెపికి ఓటేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు వేయడం లేదు..? బీజేపీ ప్రభుత్వం వస్తుందనుకున్న సమయంలో 8 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యాం? అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కు ప్రజలు ఎందుకు ఓటేయడం లేదు..? బాధ్యులు ఎవరు. ? ఈ అంశాల పై బీజేపీ ఆలోచన చేయాలి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఎవరిని చెప్పు కింద తొక్కి పెట్టాలో మాకు తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ అరవింద్.
మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పలు ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుదామంటే తాను నా ఫోన్ ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్.