బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. రాడార్ వ్యవస్థకు ఎందుకు అనుమతి ఇచ్చారో ముందు మీ నాన్న కేసీఆర్ నిలదీయ్ అని కేటీఆర్ కి సూచించారు. బండి సంజయ్. ఆనాడు మీరే అనుమతి ఇచ్చి.. ఇప్పుడు మీరే వ్యతిరేకిస్తారా? అని సీరియస్ అయ్యారు. దేశ భద్రత వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకించడమంటే.. దేశ ప్రయోజనాలను వ్యతిరేకించినట్టే అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పినా మార్పు రాలేదని విమర్శించారు. వికారాబాద్ జిల్లా దామగుండం అడవుల్లో VLF స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ‘ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు అంశం ఇప్పటిది కాదు.. గత పద్నాగేళ్లుగా పెండింగ్ లో ఉంది. అన్ని అడ్డంకులు దాటుకుని ఈరోజు భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పదేపదే చొరవ తీసుకోవడంవల్లే ఇది సాధ్యమైంది’ అని బండి సంజయ్ వెల్లడించారు.