ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులు, మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రియాంక గాంధీతో చర్చించారు. అలాగే ఖమ్మం, నల్గొండలో జరగనున్న సభలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు.
అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పది రోజులకు ఒకసారి తెలంగాణకు రావాలని ప్రియాంక గాంధీని కోరినట్లు తెలిపారు వెంకట్ రెడ్డి. కర్ణాటక తరహాలో 70% టికెట్లను ముందే ప్రకటించాలని కోరినట్లు తెలిపారు. ఇక నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని ప్రియాంక గాంధీ సూచించారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో నేతల మధ్య ఇలాంటి విభేదాలు లేవని అన్నారు కోమటిరెడ్డి.