మునుగోడు ఉప ఎన్నికల బరిలో సిపిఐ !

-

ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ మొత్తం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో ప్రధాన పార్టీలన్నీ బైపోల్ వ్యూహాలకు పదును పెట్టే పనిలోపడ్డాయి. అయితే ఈ మునుగోడు నియోజకవర్గం లో కమ్యూనిస్టు పార్టీల ప్రభాల్యం ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు అక్కడ 12సార్లు అసెంబ్లీ ఎన్నికలుు జరిగితే.. ఆరుసార్లు కాంగ్రెస్, ఐదు సార్లు సిపిఐ, ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీలో విజయం సాధించాయి.

మొత్తంగా చూస్తే కాంగ్రెస్, సిపిఐ పార్టీలే ప్రధానంగా పోటీ పడ్డాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ నెల 12న మునుగోడు ఉప ఎన్నికలపై సిపిఐ ముఖ్య నాయకులు సమావేశం కానున్నారు.చండూరులో పార్టీ మండల అధ్యక్షులతో సమావేశం కానున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా? లేక ఎవరికి మద్దతు ఇవ్వాలి అన్నదానిపై చర్చ జరగనుంది. ఒకవేళ సిపిఐ పోటీ చేస్తే నెల్లికంటి సత్యం ని బరిలో నిలిపే దిశగా సిపిఐ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news