సూర్యాస్తమయం సమయంలో మనం చేసే పొరపాట్ల వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటివి సూర్యాస్తమయం సమయంలో చేస్తే ఆర్థిక బాధలని ఎదుర్కోవాల్సి వస్తుంది. సూర్యాస్తమయంలో అసలు ఈ పొరపాట్లను చేయకండి దాంతో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. సూర్యాస్తమయం సమయంలో తులసి మొక్కని ముట్టుకోకూడదు తులసి ఆకులని తెంపకూడదు. తులసి మొక్క దగ్గరికి వెళ్లి పూజించినా కూడా తులసి మొక్కని ముట్టుకోకూడదు.
సాయంత్రం సంధ్య వేళలో అసలు ముఖద్వారం తలుపు మూయకుండా ఉంచాలి. తలుపు తెరిచి ఉంచడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఆర్థిక బాధలు ఉండవు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఉప్పు వెల్లుల్లి ఉల్లి వంటివి ఎవరిని అడగకూడదు. నెగటివ్ ఎనర్జీ వీటి వల్ల కలుగుతుంది కాబట్టి ఈ తప్పును కూడా చేయకుండా చూసుకోండి.
వాస్తు ప్రకారం పేద వాళ్ళు ఎవరైనా కానీ సహాయం కోసం వచ్చిన వాళ్ళు కానీ వట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి ఈ పొరపాటున కూడా చేయకుండా చూసుకోండి. సాయంత్రం పూట నిద్రపోవడం కూడా మంచిది కాదు. అలానే సాయంత్రం పూట డబ్బులు ఇవ్వడం ధాన్యం వంటివి ఇవ్వడం వంటివి కూడా చేయకూడదు. కాబట్టి అస్సలు ఈ పొరపాట్లని సాయంత్రం చెయ్యకండి. ఆర్థిక ఇబ్బందులని ఎదుర్కోవాలి.
సూర్యాస్తమయం అయిన తర్వాత తలని దువ్వుకోవడం అస్సలు చెయ్యద్దు. గోళ్ళని కూడా కత్తిరించద్దు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు చీకటిగా ఉండకూడదు ఇంట్లో లైట్ల ని వేయాలి అదే విధంగా సూర్యాస్తమయం అయిన తర్వాత తలుపుల్ని కాసేపు పాటు తెరుస్తూ ఉండడం మర్చిపోకండి ఇలా ఈ చిట్కాలని కచ్చితంగా పాటిస్తే ఆర్థిక బాధలు వంటివి ఉండవు అలానే సూర్యాస్తమయం అయిన తర్వాత పేలు చూసుకోవడం తిట్టుకోవడం వంటివి చేయకూడదు.