బీఆర్ఎస్ ను భూ స్థాపితం చేయడమే నా లక్ష్యం : రాజ్ గోపాల్ రెడ్డి

-

బీఆర్ఎస్ పార్టీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఇన్ చార్జ్ ఉన్న భువనగిరి నియోజకవర్గ నేతలతో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని భూ స్థాపితం చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని.. రాష్ట్రాన్ని కల్వకుంట్ల ఫ్యామిలీ నాశనం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసిందన్నారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి వెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భువనగిరిలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నమోదు అవుతాయని పేర్కొన్నారు రాజగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news