‘నా లవర్ తండ్రి చావగొడుతున్నాడు’.. కాపాడండి ప్లీజ్

-

ప్రస్తుత కాలంలో పదో తరగతి కూడా పాస్ కాక ముందే విద్యార్థులు ప్రేమలో పడుతున్నారు. ప్రేమ కోసం కొంత మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ప్రేయసి.. ప్రేమికుడు అంటూ నిత్యం ప్రేమలో మునిగిపోతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి ప్రేమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న ఏజ్ లోనే ప్రేమ అనే మోజులో తల్లిదండ్రులు అవుతున్నారు.

తెలిసి, తెలియని వయస్సులో బాలికలు తల్లులు కావడంతో కొంత మంది చెట్ల పొదల్లో పుట్టిన పిల్లలను వదులుతున్నారు. తాజాగా ఓ యువకుడిని తన ప్రేయసి మనకు కొడుకు పుట్టాడు చూడటానికి రా.. అంటూ పిలిచింది.  ఆ యువకుడు ఆమె ఇంటికి వెళ్లాడు. కానీ సీసీ కెమెరాల ద్వారా గమనించి అలర్ట్​ అయిన ఆ అమ్మాయి తండ్రి ఆ యువకుడిని పట్టుకుని చితకబాదాడు. గదిలోకి వెళ్లి దాక్కున్న ఆ వ్యక్తి.. డయల్​ 100కు ఫోన్​ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నా లవర్ తండ్రి చావగొడుతున్నాడు.. జరంత కాపాడండి ప్లీజ్ అని వేడుకున్నాడు. ఈ ఘటన వినేందుకు సినిమా స్టోరీలా ఉన్న ఈ ఘటన బండ్లగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news