ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పార్టీదే అధికారం.. జోస్యం చెప్పిన మంత్రి

-

ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. దీంతో జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల కోసం ప్రధాన పార్టీలన్నీ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో అధికారం ఎవరు చేపడుతారు అనే దానిపైన అన్ని పార్టీలలో ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటు రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజలు జూన్ 4న విడుదల అయ్యే ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు.ఏ పార్టీకి చెందిన నాయకుడు ఆ పార్టీయే అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మరోసారి జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని భీమ వ్యక్తం చేశారు. జూన్ 9న విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని జోష్ అని చెప్పారు. ఈ సారి విజయనగరం జిల్లాలో 9 స్థానాల్లో వైసీపీ గెలుస్తోందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news