పదేళ్ల మోడీ పాలనలో ఎక్కడ స్కాములు లేవు: ఈటల రాజేందర్

-

నర్సంపేటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. గతంలో మిలట్రీ జవాన్లు తిరిగి ఇంటికి వస్తారో రారో అని తల్లిదండ్రులు భయపడేవారు. కానీ ఇప్పుడు సంతోషంగా మిలట్రీకి తమ బిడ్డలను పంపిస్తున్నారు అని ఈటల రాజేందర్ అన్నారు .అప్పట్లో జమ్ముకాశ్మీర్‌లో ఎప్పుడూ బాంబుల మోతలు ఉండేవి. కానీ ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ప్రశాంతంగా మారింది. నేను ఎంపీ ఎన్నికల ప్రచారానికి తిరుగుతున్నప్పుడు ప్రధాని మోదీకి ఓటు వేస్తామంటూ అనేకమంది చెప్పారు అని తెలిపారు.

పల్లెటూరు మహిళల బాధను అర్థం చేసుకుని, వారికోసం 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్లు కట్టించారు. గత ప్రభుత్వం మోదీతో గొడవలు పెట్టుకోవడం వల్ల ఈ రాష్ట్రంలో పేదలకు సొంతిళ్లు రాలేదు. కానీ దేశంలో 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు కట్టించారు.నేడు ఈ దేశంలో చదువురాని మహిళలు కూడా మొబైల్ ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నేషనల్ హైవే రోడ్లు చాలా అభివృద్ధి చెందాయి. మోదీ పదేళ్ల పాలనలో ఎక్కడా స్కాంలు లేవు. 50 ఏళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో స్కాంలలో పాలు పంచుకుంది అని ఈటల రాజేంద ర్ తీవ్రస్థాయిల విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news