తెలంగాణలో విషాదం..భార్యను నరికి, ఆత్మహత్య చేసుకున్న భర్త

-

తెలంగాణలో విషాదంచోటు చేసుకుంది. భార్యను నరికి, ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో ఈ దారుణం నిన్న రాత్రి చోటు చేసుకుంది. భార్యను కొబ్బరి బోండాల కత్తితో నరికి తాను ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. జన్వాడ సమీపంలోని మన్నెగడ్డలో ఆర్‌ఎంపిగా పనిచేస్తున్నాడు నాగరాజు.

నిన్న రాత్రి భార్యాభర్తలు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే.. కొబ్బరిబోండాల కత్తితో భార్య సుధను నరికి చంపాడు నాగరాజు. పిల్లలను చంపడానికి ప్రయత్నించిన నాగరాజు… మెత్తతో ఊపిరాడకుండా చేసి పిల్లలను చంపే ప్రయత్నం చేశాడు. అయితే.. తృటిలో తప్పించుకున్నాడు చిన్నారులు.అటు పురుగులు ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు నాగరాజు. ఇక ఈ సంఘటన తెలియగానే ఘటన స్థలానికి వచ్చి..కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అలాగే.. డెడ్‌బాడీలను మార్చురీకి తరలించిన పోలీసులు.. విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news