కాసేపట్లో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత…144 సెక్షన్ !

-

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం : 580.80 అడుగులు ఉంది. అలానే ఇన్ ఫ్లో :3,50,102 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో : 29,880 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 285.3216 టీఎంసీలుగా ఉంది.

ఇక ఈ రోజు ఉదయం 11 గంటలకు సాగర్ డ్యామ్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు అధికారులు. కొవిడ్ విజ్రుంభణ నేపథ్యంలో నాగార్జున సాగర్ కి పర్యాటకులకు అనుమతి నిరాకరిస్తున్నారు. అయితే జనం వచ్చే అవకాశం ఉండడంతో 144 సెక్ష న్ అమలు చేస్తున్నారు పోలీసులు. ఇక జలాశయం పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news