నల్గొండలో నకిలీ మహిళా పోలీస్ అరెస్టు…!

-

నకిలీ మహిళా పోలీస్ అరెస్టు అయ్యారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, 2018లో అర్.పి.ఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసి దాదాపు అన్ని అర్హతలు సాధించింది. కానీ మెడికల్ చెకప్‌లో దృష్టి లోపం కారణంగా తిరస్కరణకు గురైంది. అయితే అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు తాను ఎస్ఐ అవుతున్నట్లు చెప్పుకుంది.తన పరువు పోతుందని భావించిన మాళవిక ఎస్ఐ యూనిఫాం కుట్టించుకోవడంతో పాటు, నకిలీ ఐడి కార్డ్ చేయించుకుంది.

విషయం తెలుసుకున్న అర్.పి.ఎఫ్ పోలీసులు మాళవికను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నార్కట్ పల్లి గ్రామానికి చెందిన మాళవిక, శంకర్ పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించింది. అయితే అర్.పి.ఎఫ్ యూనిఫాంలో రీల్స్ చేయటమే కాకుండా, పెళ్లి సంబంధం చూసేందుకు కూడా యూనిఫాంలోనే వెళ్లింది. యూనిఫాంలోనే వీఐపి దర్శనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడం చేసింది. పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్ళు అధికారులను సంప్రదించగా మోసం బయటపడింది. ఆర్.పి.ఎఫ్ పోలీసులు మాళవికని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news