మహబూబ్నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బిజెపి పార్టీలోకి వెళ్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బిజెపి పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. అయితే అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు శ్రీనివాస్ గౌడ్ ను బిజెపిలోకి లాగుతున్నారట.

అయితే ఈ వార్తలపై స్వయంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని… గులాబీ పార్టీలోనే ఉంటానని తెలిపారు. అయోధ్యకు వెళితే బిజెపి పార్టీలో చేరినట్లు భావిస్తారా ? అంటూ నిప్పులు చెరిగారు శ్రీనివాస్ గౌడ్. చివరి వరకు గులాబీ పార్టీలో ఉంటానని… ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరిక చాలా సంతోషం అని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ పై ఉద్యమం తప్పదని హెచ్చరించారు.