తెలంగాణలో టెర్రర్.. నాంపల్లి ఎమ్మెల్యేకి కరోనా..!

తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు.. ఇలా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే ఇందులో చాలా వరకు కోలుకుంటుంటే.. కొంతమంది మరణిస్తున్నారు. తాజాగా.. నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌కు పాజిటివ్ వచ్చింది. శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలందరికీ అధికారులు రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇందులో జాఫర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఆయన్ని హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. అలాగే గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారిని టెస్టు చేయించుకోవాల్సిందినగా ఎమ్మెల్యే కోరారు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 1,58,153కి చేరింది. మృతుల సంఖ్య 974కి పెరిగింది.