వైద్య, ఆరోగ్య శాఖ మంత్రితో చర్చలు విఫలం.. యథాతథంగా జూడాల సమ్మె

-

ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం.. హాస్టల్ వసతి, పని ప్రదేశాల్లో భద్రత పెంచాల రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె సైర్ మోగించారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే ఓపీ సేవలు, తాత్కాలిక ఓటీ సేవలు నిలిచిపోయాయి. అటు గాంధీ ఆసుపత్రిలో, ఇటు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో జూడాలు తమ విధులను బహిష్కరించి ఆసుపత్రుల ఎదుట బైఠాయించారు. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే జూడాల సమస్యల పరిష్కారానికి సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వం నుంచి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాలతో చర్చలు జరిపారు. అయితే, చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. జూడాలు లేవనెత్తిన డిమాండ్లలో కొన్ని అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది మరికొన్ని అంశాలపై మరోసారి చర్చించాలని నిర్ణయించారని జూడాలు తెలిపారు. అదేవిధంగా ఆయా అంశాలపై ప్రపోజల్స్ను ఉన్నతాధికారులకు పంపినట్లుగా వారు వెల్లడించారు. అప్పటి వరకు సమ్మె యధాతథంగా కొనసాగుతోందని జూడాలు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news