టీ-వర్క్స్, టీ-హబ్‌కు కొత్త సీఈవోలు

-

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టీ -వర్క్స్ సీఈవోగా జోగీందర్ తనికెళ్ల, వీ హట్ సీఈవోగా సీతా పల్లచోళ్ల ను నియమించింది. ఈ మేరకు ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం నియమించిన వీరు ఈ పదవుల్లో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా టీ వర్క్స్ అనేది ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్‌వేర్‌ రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అతిపెద్ద ప్రొటోటైపింగ్‌ కేంద్రం. ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్ళండి.. అనే నినాదంతో రూపొందిన టీ వర్క్స్, హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల తయారీకి కేంద్రంగా మారిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news