BREAKING : వచ్చే నెలలోనే కొత్త పెన్షన్లు మంజూరు

-

కొడంగల్ లో ఇవాళ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కొడంగల్ ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేస్తున్నామని తెలిపారు. గతంలో ఉన్న రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటానాయి,, కానీ చేతలు లేవని విమర్శలు చేశారు.


కోర్ట్ కేస్ లు అధిగమించి కొడంగల్ కు PLI ద్వారా నీళ్లిస్తామని..కర్ణాటక బీజేపీ పాలనలో ఏ పాటి అభివృద్ధి ఉంది?? అని తెలిపారు. వచ్చే నెల రెండు నెలల్లో అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు.కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పై కక్ష కట్టింది.కాంగ్రెస్ ఖతం, గతం…ఇక వచ్చే పరిస్థితి లేదని ఫైర్ అయ్యారు హరీశ్ రావు.

రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపిస్తారని.. 8,9 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నావు ఎందుకు అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ, బస్ డిపో ఎందుకు తేలేదని.. రైతు డిక్లరేషన్ అంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్ఘడ్, రాజస్థాన్ లో చేయండన్నారు. మీరు అధికారంలోకి వచ్చేది లేదు.. ఆ అవకాశమే లేదని ఎద్దేవా చేశారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news