తెలంగాణ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదని పేర్కొన్నారు మాజీ సీఎం కేసీఆర్. తాజాగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా మాట్లాడారు. గులాబీ జెండాది పాతికేళ్ల ప్రస్థానం అన్నారు. తెలంగాణలో దవఖానాల పరిస్థితి మరింత దారుణ పరిస్థితి నెలకొంది అన్నారు. చేప పిల్లలు, గొర్రె పిల్లలు పంపిణీ చేశాం. అన్ని రంగాల్లో దేశంలో తెలంగాణను నెంబర్ వన్ స్థానంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.
తొమ్మిదేళ్లు కష్టపడి తెలంగాణను అభివృద్ధి చేశామని తెలిపారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ మన్నె జీవన్ రెడ్డి విజయం సాధించారు. ఓట్ల కోసం రైతు బంధు ఇవ్వలేదు. 15 ఏండ్ల పోరాటం తరువాత తెలంగాణ వచ్చిందని తెలిపారు. రాజకీయ ఫలితాల కోసం పిచ్చి పిచ్చి కాకూడదని సూచించారు. పదేళ్లు కేంద్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది.. ఖతమైందా..? అని ప్రశ్నించారు. అధికారంలో ఉంటేనే రాజకీయం అంటే తప్పు అన్నారు. ఆటో డ్రైవర్ వచ్చి నా కాళ్ల మీద పడి.. సార్ మళ్లీ మనమే గెలుస్తామని చెప్పారు.